మహబూబ్ నగర్ నియోజకవర్గం హన్వాడ మండలం అమ్మాపూర్ గ్రామ శివారులోని 71, 74 సర్వే నంబర్లలో ఉన్న 26 ఎకరాల భూమిపై మొఖాకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడు టంకాల కృష్ణయ్య కబ్జాకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.
72, 73 సర్వే నంబర్లలో ఉన్న బాపన సూచేంద్ర అనే వ్యక్తి నుంచి తన పేరు మీదకు భూమిని బదాయించుకున్నట్లు సమాచారం. ఆ భూమి రికార్డులోనే ఉంది. కానీ, భూమి లేకపోవడంతో 71,74 సర్వే నంబర్లలో ఉన్న భూమిపైకి వెళ్లి అక్కడి రైతులను ఎమ్మెల్యే అనుచరుడు టంకాల కృష్ణయ్య బెదిరిస్తున్నట్లు బాధితులు ఆవేదనవ్యక్తంచేస్తున్నారు. ఎవరైనా అడ్డు వస్తే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని.. ఏకంగా ఎమ్మార్వోను కూడా బెదిరించాడని తెలుస్తోంది. 200 ఏళ్ల నుండి తమ తాత ముత్తాతలు వ్యవసాయం చేసిన భూములు అని, టంకాల కృష్ణయ్యతో తమకు ప్రాణభయం ఉందని.. తమకు రక్షణ కల్పించి, తమ భూమిని తమకు అప్పగించాలని రైతులు వేడుకుంటున్నారు.