రీ-ట్వీట్ చేసినా కేసులు పెడుతున్న పోలీస్ అధికారులకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తున్న ఆ కొంత మందిని ఎవరిని వదిలి ప్రసక్తే లేదు.. మీ మీద కూడా సుప్రీంకోర్టుకు పోతాము అని వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. రేవంత్ రెడ్డి HCU భూములపై చేసిన కుంభకోణంపై మోడీ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని… HCU భూముల్లో రేవంత్ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తున్నాడని మోడీ హర్యానాలో మాట్లాడాడు అని ఆగ్రహించారు.

మోడీ మాటల వరకేనా? HCU భూముల కుంభకోణంపై విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ఫైర్ అయ్యారు. సుప్రీంకోర్టు నియమించిన సీఈసీ HCU భూములపై కుంభకోణం జరిగిందని, ఇన్విస్టిగేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని నిన్న నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఈ కుంభకోణంపై మా పార్టీ తరపున అన్ని ఆధారాలతో సహా లేఖ రాశామన్నారు కేటీఆర్. మోడీకి చిత్తశుద్ధి ఉంటే ఈ కుంభకోణంపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. లేదంటే మోడీ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని మేమే కాదు తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటారని చురకలు అంటించారు కేటీఆర్.
రిట్వీట్ చేసినా కేసులు పెడుతున్న పోలీస్ అధికారులకు కేటీఆర్ వార్నింగ్
రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తున్న ఆ కొంత మందిని ఎవరిని వదిలి ప్రసక్తే లేదు.. మీ మీద కూడా సుప్రీంకోర్టుకు పోతాము – కేటీఆర్ pic.twitter.com/qo7tuDi83H
— Telugu Scribe (@TeluguScribe) April 17, 2025