హిమాచల్ ప్రదేశ్ లో విరిగిపడిన కొండచరియలు : 40 మంది ప్రయాణికులు !

-

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ లోని…. కిన్నౌర్ జిల్లాలోని రేఖాంగ్ పియో – సిమ్లా జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం పూట భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. మధ్యాహ్నం ఒకటి గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక లారీ మరియు ఆర్టీసీ బస్సు తో పాటు పలు వాహనాలు చిక్కుకుపోయినట్లు అధికారులు గుర్తించారు.

ఒక్కసారిగా భారీ కొండ చరియలు విరిగిపడడంతో వాహనాలన్నీ బండరాళ్ల కింద చిక్కుకుపోయాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన బస్సులో ఏకంగా 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రయాణికులకు పరిస్థితి ఎలా ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఘటనా స్థలానికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు చాలా భయా ఆందోళన కరంగా ఉన్నాయి. ఇక ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మురం చేయాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version