యాంకర్ లాస్య దివాళి స్పెషల్ సాంగ్…స్పెషల్ అట్రాక్షన్ గా మిర్యాలగూడ అమృత…!

-

తెలుగు లో యాంకర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న లాస్య యూట్యూబ్ లో కూడా వీడియోలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీపావళి సందర్భంగా లాస్య ఓ స్పెషల్ సాంగ్ ను విడుదల చేసింది. అయితే ఈ సాంగ్ లో అలేఖ్య, గలాటా గీతు తో పాటు మిర్యాలగూడ అమృత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక అమృత కూడా యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది

తన కుమారుడికి సంబంధించిన వీడియోలు తన భర్త తో గడిపిన క్షణాలు మరియు ఇతర వీడియో లు చేస్తూ అమృత యూట్యూబ్ లో ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పుడు లాస్య దీపావళి స్పెషల్ వీడియో సాంగ్ లో అమృత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. లాస్య తో కలిసి అమృత స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంది. ఇక ఈ వీడియో లో ముగ్గురు భామలు కూడా ట్రెడిషనల్ డ్రెస్ లలో అలరించారు. అంతే కాకుండా ఈ వీడియో లో లాస్య కుమారుడు, భర్త మజునాత్ కూడా ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో యుట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news