ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణ‌యం.. సమ్మె విరమించామంటూ ప్ర‌క‌ట‌న‌..

-

52 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. రేపటి నుంచి కార్మికులందరూ డ్యూటీలకు హాజరుకావాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు. ఇదే విషయమై సోమవారం మీడియాతో మాట్లాడిన జేఏసీ నేతలు.. కార్మికుల శ్రేయస్సు కోసమే సమ్మె విరమించినట్టు జేఏసీ నేతలు ప్రకటించారు. ఆర్టీసీ సమ్మె ద్వారా కార్మికులు నైతిక విజయం సాధించారని వారు తెలిపారు. తప్పని పరిస్థితుల్లోనూ సమ్మె విరమిస్తున్నామని… సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు జేఏసీ కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు.

అధికారులు కొంతమంది ఆర్టీసీని అమ్ముకునే ప్రయత్నం చేశారని అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీని ప్రైవేటీకరించాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. దానిని అడ్డుకోవాలన్నారు. సమ్మె విరమించినా నైతిక విజయం కార్మికులదేనని అన్నారు. కార్మికులు ఓడిపోలేదని, ప్రభుత్వ గెలవలేదని పేర్కొన్నారు. హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వం లేబర్ కోర్డుకు వెళ్లాల్సి ఉందన్నారు. కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా కార్మికులందరూ విధులకు హాజరవ్వాలని అశ్వత్థామరెడ్డి కోరారు. ఇన్ని రోజులు బస్సులు నడిపిన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు రేపటి నుంచి డ్యూటీలకు హాజరుకావొద్దని విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version