పెట్రోల్, డీజెల్ ధరలు పై చూపులు చూస్తూనే ఉన్నాయి. చమురు సంస్థలు పెట్రోల్ డీజెల్ ధరలను వరుసగా నాలుగో రోజు కూడా పెంచి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. పెట్రోల్ ధరలు పెరగడంతో వాహన దారులుకు మరింత భారం మోయాల్సి వస్తోంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 80.32 ఉండగా, ఢిల్లీలో రూ.74.66గా ఉంది. డీజిల్ ధరలు ఢిల్లీలో రూ. 65.73, కోల్‌కతాలో రూ. 68.14, ముంబైలో రూ. 68.94, చెన్నైలో రూ. 69.47గా ఉన్నాయి.
కాగా, గత నాలుగు రోజుల్లో ఢిల్లీలో పెట్రోల్ ధర 46 పైసలు పెరిగింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో ఈ పరిస్థితి వచ్చిందని, అందుకే ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ధరలు పెంచాయనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా పెరిగిన ధరలతో పెట్రోల్ ధర ఏకంగా ఏడాది గరిష్టానికి చేరుకుంది.