బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాష్ట్రంలో పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్ని బావి గ్రామంలో కొమ్మల జాతర సందర్భంగా బీఆర్ఎస్ ప్రభ బండ్లతో కొందరు జాతరకు వెళ్తున్నారు.
అయితే,గులాబీ జెండాలు పెట్టుకుని వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. అది కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారితీయగా.. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు బీఆర్ఎస్ నాయకులపై లాఠీచార్జ్ చేశారు. దీనికి సంబంధించి విజువల్స్ సోషల్ మీడియాలో గులాబీ నేతలు వైరల్ చేస్తున్నారు.