జనగామ జిల్లాలో మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ మండలంలోని వడ్లకొండ గ్రామ పరిధిలోని ఎర్రగుంట తండా వద్ద ప్రజా పాలన నాలుగు పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయగా.. సభా ప్రాంగణానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేరుకోగా వారితోపాటు వచ్చిన కొంత మంది బిఆర్ఎస్ లీడర్లును అనుమతించలేదు పోలీసులు. దీంతో జై పల్లా జై బిఆర్ఎస్ అంటూ ఒక్కసారిగా బిఆర్ఎస్ శ్రేణుల నినాదాలు చేసారు.
దాంతో జై కాంగ్రెస్, పల్లా గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేయగా.. కాంగ్రెస్- బిఆర్ఎస్ నేతల మధ్య పోటాపోటీ నినాదాలు నడిచాయి. ఇక పరిస్థితి ఉదృతంగా మారి కాంగ్రెస్- బిఆర్ఎస్ నేతల మధ్య నెలకొన్న ఘర్షణ నెలకొంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడి చేసుకోగా.. పరిస్థితి అదుపు చేసేందుకు లాఠీ చార్జ్ చేసారు పోలీసులు. అందువల్ల పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు.