బండి సంజయ్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి : మల్లురవి

-

76వ రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు పేదలకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. తెలంగాణ లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరు చేయడం సంతోషంగా ఉంది అని ఎంపీ మల్లురవి అన్నారు. రైతులకు ఎకరానికి ఆరువేల రూపాయలు మొదటి విడత రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఇచ్చినది. గ్రామసభల ద్వారా తెలంగాణ లో కొత్తగా ప్రవేశపెట్టిన నాలుగు పథకాల లబ్ధి దారులను ఎంపిక చేసాము. గతంలో రాజ్యాంగేతర శక్తులుగా ఉన్న నక్సలైట్లు చట్టవిరుద్ధంగా గ్రామసభలు నిర్వహించేవారు. రాబోయే రోజుల్లో తెలంగాణ లో అన్ని గ్రామాలలో కొత్తగా ఏర్పాటు చేసిన నాలుగు పథకాలను అమలు చేస్తారు.

కేంద్రం నుంచి ఒక లక్ష ఇళ్లు తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తే, కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం వాటికి ఇందిరమ్మ పేరు పెడితే ఇళ్ల కేటాయింపులు రద్దు చేస్తామని చెప్పడం దారుణం. కేంద్రంలో అధికారంలో ఉన్న వారు మాత్రం కేంద్ర ప్రభుత్వ పథకాలకు బిజెపి నేతల పేర్లు పెట్టడం ఎంతవరకు సమంజసం. బండి సంజయ్ తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. బండి సంజయ్ మెజారిటీ ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తెలంగాణ ప్రభుత్వం గౌరవించినప్పుడు, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర మంత్రులు గౌరవించాలి. బండి సంజయ్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకునేలా ప్రధాని, కేంద్ర హోంమంత్రి జోక్యం చేసుకోవాలి అని మల్లురవి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news