సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ ప్రారంభ కార్యక్రమాన్ని ఇవాళ సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్ఢంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఏపీ సేవ పేరును ఈపోర్ట్‌లో పెడుతున్నామని.. మారుమూల గ్రామాల్లో కూడా వేగంగా, పారదర్శకంగా, జవాబుదారీ తనం పెంచే కార్యక్రమం ఇదన్నారు.
ఏపీ సేవా పోర్టల్ ఓ గొప్ప ముందడుగమని.. గ్రామ స్వరాజ్యం అంటే గడచిన ఈ రెండేళ్లకాలంలో మన కళ్లముందే కనిపించేలా ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోందని చెప్పారు. ఇక నుంచి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు వస్తాయన్నారు.
540కిపైగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సేవలందిస్తున్నామని.. ప్రతి 2వేల జనాభాకు ఒకటిచొప్పున గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 15,004 సచివాలయాలు పని చేస్తున్నాయని.. 1.30 లక్షలమది రెగ్యులర్ ఉద్యోగులు దాదాపుగా పని చేస్తున్నారని చెప్పారు. 2.60వేలమంది ప్రతి 50 ఇళ్లకు గ్రామ స్థాయిలో, ప్రతి 100 ఇళ్లకు ఒక వాలంటర్ చొప్పున మున్సిపల్ స్థాయిలో ఉన్నారని.. మొత్తంగా దాదాపు 4 లక్షల మంది డెలివరీ మెకానిజంలో పనిచే స్తున్నారన్నారు. వీరంతా ప్రభుత్వ పథకాలు, సేవలు అందించడంలో నిరంతరం పనిచేస్తున్నారని వెల్లడించారు.