రామ్ చరణ్ కి లావణ్య విషెస్.. ఆటపట్టిస్తున్న నెటిజన్స్..!

-

రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో ఆయన పేరు మారుమ్రోగిపోతోంది. ఫ్యాన్స్ అలానే సెలబ్రిటీలు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నెట్టింట ప్రస్తుతం చరణ్ హవా నడుస్తోంది. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు సైతం గ్లోబల్ స్టార్ కి విషెస్ చెబుతున్నారు. మేగా ఫ్యామిలీకి చెందిన వాళ్ళందరూ పోస్టులు పెట్టారు మెగాస్టార్ చిరంజీవి మాత్రం పెట్టలేదు. వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి ఒక పోస్ట్ చేయడం అది కాస్త వైరల్ అవ్వడం జరిగింది.

చరణ్ తో కలిసి ఉన్న ఫోటో పెడుతూ మరో గొప్ప సంవత్సరం సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ అని పోస్ట్ పెట్టారు దీంతో ఈ పోస్ట్ చూసిన మెగా ఫాన్స్ బావ అని పెడితే బాగుండేది పేరుతో పెట్టకుండా బావగారు అని పెట్టాలి అని లావణ్య త్రిపాఠి ని ఆటపట్టిస్తున్నారు. కొంతమంది కొంచెం మంచి ఫోటోని షేర్ చేయొచ్చు కదా చూడలేకపోతున్నామని కామెంట్స్ చేసారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version