ఉద్యోగాల భర్తీ వేళ టీఎస్పీఎస్సీ పోస్టు పై కన్నేసిన నేతలు

-

తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల్లో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ పదవి అత్యంత కీలకమైంది. వివిధ కార్పొరేషన్లు.. నామినేటెడ్‌ పోస్టుల నియామకాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం పైగా భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్ల పై తెలంగా సర్కార్ దృష్టి సారించడంతో నేతల కన్ను ఇప్పుడి పోస్టు పై పడింది. ఛైర్మన్‌ సహా సభ్యులగా అవకాశం దక్కించుకునేందుకు ఓ రేంజ్ లో పోటిపడుతున్నారు నేతలు.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ పదవి గత ఏడాది డిసెంబర్‌లో ఖాళీ అయింది. కమిషన్‌లో ప్రస్తుతం ఒక్కరే సభ్యుడుగా ఉన్నారు. ఈ పోస్టులను ప్రభుత్వం ఎప్పుడైనా భర్తీ చేయొచ్చన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వివిధ ప్రభుత్వ విభాగాలలో ఉన్న ఖాళీల చిట్టా తెప్పించుకుంటోంది. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా నియామకాలు చేపట్టాల్సి ఉంటే ముందుగా కమిషన్‌ ఛైర్మన్‌,సభ్యుల నియామకం చేపట్టనుంది తెలంగాణ సర్కార్.

ఇప్పటికే ఛైర్మన్‌ పోస్ట్‌పై ఒక మాజీ పోలీస్‌ అధికారి సహా అనేకమంది పేర్లు చర్చలోకి వచ్చాయి. ఈసారి కూడా పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ సభ్యుడిగా ఉద్యోగ సంఘం మాజీ నేతకు అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. టీఎన్జీవో అధ్యక్షులుగా పనిచేసిన స్వామిగౌడ్‌, దేవీప్రసాద్‌లకు పదవులు దక్కాయి. స్వామిగౌడ్‌ ప్రస్తుతం బీజేపీకి వెళ్లిపోయారు. వీరిద్దరి తర్వాత టీఎన్జీవో అధ్యక్షుడిగా పనిచేసిన కారెం రవీందర్‌కు ఎలాంటి పోస్ట్‌ దక్కలేదు.

టీజీవో నేతగా ఉన్న శ్రీనివాస్‌గౌడ్‌ను సైతం కేబినెట్‌లోకి తీసుకున్నారు. దీంతో రవీందర్ పేరు ఉద్యోగ సంఘాల్లో చర్చకు వస్తోంది. మొన్నటి వరకు టీఎస్పీఎస్సీ సభ్యుడిగా ఉద్యోగ సంఘం నేత విఠల్‌ పనిచేశారు. ఇప్పుడు ఆ ప్లేస్‌లో రవీందర్‌కు ఛాన్స్‌ ఇస్తారని అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version