షాకింగ్ : గ్రేటర్ ప్రచారంలో పాల్గొన్న నాయకులు.. కార్యకర్తలు ఐసోలేషన్ లోకి ?

-

తెలంగాణా డిహెచ్ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రచారంలో పాల్గొన్న నాయకులు.. కార్యకర్తలు ఐసోలేషన్ లో ఉండాలని కోరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసులు పెరిగే అవకాశం ఉందని, అందుకే  ప్రచారంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు ఐసోలేషన్ లో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. నాలుగు నెలలుగా 1 శాతం పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అవుతున్నాయని తెలంగాణలో 96.03 శాతం కరోనా రికవరీ నమోదయింది. తెలంగాణలో ప్రస్తుతం బెడ్ ఆక్యుపెన్సీ  11.09 శాతం మాత్రమే ఉందని అన్నారు. 

సెకండ్ వేవ్ పై వైద్య శాఖ అప్రమత్తం గా ఉందన్న ఆయన ఇప్పటికే చలి తీవ్రత పెరిగిందని అన్నారు. పరిస్థితులు చూస్తుంటే, తెలంగాణలో కూడా సెకండ్ వేవ్ రావచ్చనిపిస్తోందని అన్నారు. మిగతా రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ వస్తున్న నేపథ్యంలో తెలంగాణ మినహాయింపు కాకపోవచ్చని అన్నారు. ఎన్నికల సందర్భంగా మాస్ గ్యాదరింగ్స్ ఎక్కువగా జరిగాయని ఎన్నికల సమయంలో ప్రచారంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు 5 నుంచి 7 రోజులు ఐసోలేషన్ లో ఉండాలని ఆయన అన్నారు. ప్రతి రోజు 65 వేలకు పైగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version