టెక్నలాజి పెరిగేకొద్దీ సమాజంలో కొత్త కొత్త వస్తువులు, సరికొత్త ఫీచర్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అంత సోషల్ మీడియాను వాడుతూనే ఉన్నారు. టీనేజ్, యువకులలో ఫేస్‌బుక్ మంచి ప్రజాదరణ పొందింది. పేస్ బుక్ కి చెందిన ఇన్‌స్టాగ్రామ్ కీలక ఫీచర్ ని యాడ్ చెయ్యాలని భావిస్తుంది. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఖాతాలను లింక్ చేసిన ప్రస్తుత వినియోగదారులు వాడుతున్నారు. ఈ సంవత్సరం ఇన్‌స్టాగ్రామ్ కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని అనేక కొత్త నవీకరణలను ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే.
ఇక కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ ఆంక్షలతో ఇంటికి పరిమితమైన తన వినియోగదారులు వెబ్ బ్రౌజర్ ద్వారా బిగ్ స్కీన్ (డెస్క్ టాప్), పై వీడియోలను వీక్షించే అవకాశాన్ని కల్పించింది. అంతేకాదు కరోనా వ్యాప్తి వలన ప్రజల మధ్య దూరం పెరిగిన నేపథ్యంలో తమ లైవ్ ఫీచర్ అందరనీ దగ్గర చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, దీన్ని తొలుత భారత్‌లోనే పరీక్షించిన ఇన్‌స్టా.. ఇక్కడే అమల్లోకి తీసుకురావడం విశేషం. భారత్‌లోని పలువురు కంటెంట్ క్రియేటర్ల ఖాతాలో లైవ్ రూమ్స్‌ను పరిశీలించామని, అది సక్సెస్ అయ్యిందని ఇన్‌స్టా యాజమాన్యం ప్రకటించింది. అంతేకాదు.. త్వరలోనే ఇతర దేశాల్లోనే ఈ ఆప్షన్‌ను తీసుకువస్తామని ఇన్‌స్టా తెలిపింది.