చాలా మంది తమ పిల్లలు ఫిబ్రవరి 29న పుట్టకూడదు అని కోరుకుంటూ ఉంటారు. పుట్టిన రోజు వేడుక చెయ్యాలి అంటే నాలుగేళ్ళు ఆగాలి. ప్రతీ సారి నాలుగేళ్ళు ఆగాలి అంటే ఇబ్బంది కదా…? అందుకే చాలా మంది సిజేరియన్ తో ఒక రోజు ముందే తీసేసుకుంటూ ఉంటారు. కాని ఒక అమ్మ మాత్రం తన ఇద్దరు బిడ్డలకు సిజేరియన్ కాకుండా సహజ సిద్దంగా ఫిబ్రవరి 29 రోజునే పిల్లలకు జన్మనిచ్చింది.
ఈ సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. న్యూయార్క్ కు చెందిన లిండ్సే డెమ్చాక్ 2016లో తన కుమారుడు ఒమ్రీకి ఫిబ్రవరి 29న జన్మనిచ్చింది. అది సహజ సిద్దమైన కాన్పు. తాజాగా మరోసారి తన రెండో బిడ్డ స్కౌట్ కు కూడా 2020 లీపు సంవత్సరంలో ఫిబ్రవరి 29నే జన్మనిచ్చింది. ఈ జననం కూడా ఫిబ్రవరి 29 నే జరిగింది. ఈ రెండు ఘటనలు కూడా యాదృచ్చికమే.
2016లో ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో వైద్యులు ఫిబ్రవరి 29న డెలివరీ అవుతుందని చెప్పారు. అలాగే వైద్యులు చెప్పినట్లుగానే ఒమ్రీ లీపు సంవత్సరంలో ఫిబ్రవరి 29న ఈ భూమి మీద పడ్డాడు. స్కౌట్ మార్చి 4వ తేదీన పుట్టే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెప్పారు. ఈ విధంగా కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు లీపు ఏడాదిలో పుట్టడం చాలా అరుదని… 2.1 మిలియన్ మందిలో కేవలం ఒకసారి మాత్రమే ఇలాంటి అద్భుతం జరుగుతుందన్నారు. వీరి పుట్టిన రోజు వేడుకలను ప్రతీ ఏటా మార్చ్ 1 న జరుపుతామని చెప్పారు వైద్యులు.