ఈ మధ్యకాలంలో వరుసగా తెలంగాణా లో చిరుతపులి టెన్షన్ పెడుతున్న ఘటనలు సంచలనంగా మారుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా అటవీ ప్రాంతం ఎక్కువ ఉండడంతో కనీసం రెండు మూడు రోజులకు ఒకసారైనా ఏదో ఒక చోట చిరుత కనిపిస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. అదీ కాక ఎక్కువగా మహరాష్ట్ర సరిహద్దులను తెలంగాణ పంచుకుని ఉండడంతో అక్కడి చిరుతలు కూడా అప్పుడప్పుడు తెలంగాణ లోకి ఎంటర్ అయి ఇక్కడి వాసులను భయపెడుతున్నాయి.
తాజాగా మెదక్ జిల్లా హవేలీ ఘన పూర్ మండలం బొగుడ భూపతిపూర్ లో చిరుత పులి కలకలం రేపింది. ఈ బొగుడ భూపతిపూర్ గ్రామంలో చిరుత నిన్న రాత్రి రెండు మేకలను చంపినట్టు చేబుతునారు. దీంతో అక్కడి గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఇక ఇప్పటికే గ్రామస్థులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు గ్రామానికి చేరుకున్నట్టు చెబుతున్నారు.