ఐసిఎంఆర్ మాజీ హెడ్ ఎపిడెమియాలజిస్ట్, రామన్ గంగాఖేద్కర్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యులో కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనావైరస్ తో చేసే పోరాటం అనేది సుదీర్ఘంగా ఉంటుంది అని ఆయన అన్నారు. భారతదేశంలో టీకా కోసం మేము సిద్ధంగా ఉన్నాం అని ఆయన స్పష్టం చేసారు. మాస్క్ లతో కొత్త జీవితానికి అలవాటుపడండి అని ఆయన సూచించారు. యూరప్ అమెరికాలను చూసి మనం పాఠాలు నేర్చుకోవాలని అన్నారు.
మాస్క్ లు తప్పనిసరి అన్నారు. కుటుంబ సభ్యులతో కూడా సామాజిక దూరం అవసరం అని ఆయన అన్నారు. ఈ వ్యాధిని కట్టడి చేయవచ్చు అని కాని జాగ్రత్తగా ఉండాలని అన్నారు. రోగనిరోధక శక్తిని పెంచడం చాలా ముఖ్యం అన్నారు. వ్యాధి కట్టడిలో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం చాలా అవసరం అన్నారు. టీకాలు 90 శాతం సమర్థవంతంగా పనిచేయడం మంచిదని… మోడెర్నా, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల పని తీరు కీలకం అన్నారు.