కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రపంచం మొత్తం వైద్యులు, శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అయినా సరే దానికి వ్యాక్సిన్ మాత్రం ఇప్పటి వరకు తయారు కాలేదు. లాక్ డౌన్ సామాజిక దూరం అనే సలహాలు సూచనలు చేస్తున్నారు గాని దాని విషయంలో ఇప్పటి వరకు ఏ విధంగా ముందు అడుగు పడలేదు. కరోనా కట్టడి విషయంలో ప్రపంచం మొత్తం నరకం చూస్తుంది.
ఈ తరుణంలో కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి మంత్రి బి.శ్రీరాములు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఒక చిట్కా చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా… కరోనాకు మందు లేదన్న ఆయన… పసుపు, ఉప్పు కలిపిన నీళ్లను మూడు పూటలు తాగండని సూచించారు. వేడి నీళ్లు తాగడం అలవాటుగా చేసుకోవాలని సూచించారు. నేను డాక్టర్‌ని కాదని… ఓ వ్యాసంలో ఈ విషయం చదివానని అన్నారు.
చైనాలో చాలా మందికి ఇది ఉపయోగపడిందని ఆయన పేర్కొన్నారు. కరోనా రాకుండా జాగ్రత్తలు పడాలి అని ఆయన సూచనలు చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు తప్పుడు సంకేతాలు ఇస్తాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా కట్టడి చేయడానికి ప్రయత్నాలు చెయ్యాలి అని సూచిస్తున్నారు.