కంప్యూటర్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ లెనోవో.. ట్యాబ్ పి11 పేరిట ఓ నూతన ట్యాబ్‌ను విడుదల చేసింది. ఇందులో 11 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్ లభిస్తున్నాయి. ఇందులో ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఈ ట్యాబ్‌ను రూపొందించారు.
ఈ ల్యాబ్‌లో ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. వెను వైపు 13 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి ఫ్లాష్ సదుపాయం ఉంది. డాల్బీ అట్మోస్ ఫీచర్ లభిస్తుంది. ఈ ట్యాబ్ 12 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది.
లెనోవో ట్యాబ్ పి11 ఫీచర్లు
- 11 ఇంచుల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2000 x 1200 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
- 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10 ఓఎస్
- 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, క్వాడ్ స్పీకర్స్, డాల్బీ ఆడియో
- 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి
- 7500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
లెనోవో ట్యాబ్ పి11 ట్యాబ్ ప్లాటినం గ్రే కలర్ ఆప్షన్‌లో విడుదలైంది. ఈ ట్యాబ్ ధర రూ.24,999 ఉండగా, దీన్ని అమెజాన్‌లో విక్రయిస్తున్నారు.