లెనోవో నుంచి యోగా స్లిమ్ 7ఐ ల్యాప్‌టాప్‌.. ధ‌ర ఎంతంటే..?

-

లెనోవో కంపెనీ యోగా స్లిమ్ 7ఐ పేరిట భార‌త్‌లో ఓ నూత‌న ల్యాప్‌టాప్‌ను విడుద‌ల చేసింది. ఇందులో ఇంటెల్ కోర్ ఐ7 10వ జ‌న‌రేష‌న్ ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. ఎన్‌వీడియా జిఫోర్స్ ఎంఎక్స్‌350 2జీబీ గ్రాఫిక్ కార్డ్‌ను అంద‌జేస్తున్నారు. అలాగే ల్యాప్‌టాప్ బ్యాట‌రీ కూడా ఎక్కువ సేపు వ‌స్తుంది. విండోస్ హ‌లో ఫేషియ‌ల్ రిక‌గ్నిష‌న్‌కు ఇందులో స‌పోర్ట్‌ను అందిస్తున్నారు.

ల్యాప్‌టాప్‌ను అల్ట్రా స్లిమ్ మోడ‌ల్ రూపంలో తీర్చిదిద్దారు. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఫేస్ అన్‌లాక్ ద్వారా విండోస్‌లోకి లాగిన్ అవ్వ‌చ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో గ‌రిష్టంగా 512 జీబీ వ‌ర‌కు ఎస్ఎస్‌డీకి స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. 16జీబీ వ‌ర‌కు ర్యామ్ వేసుకోవ‌చ్చు. 14 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. డాల్బీ విజ‌న్‌, లెనోవో సూప‌ర్ రిజ‌ల్యూష‌న్ ఫీచ‌ర్ల‌ను దీనికి అందిస్తున్నారు. వైఫై 6, డాల్బీ అట్మోస్ ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి.

లెనోవో యోగా స్లిమ్ 7ఐ ల్యాప్‌టాప్ స్లేట్ గ్రే క‌ల‌ర్ ఆప్ష‌న్‌లో విడుద‌లైంది. రూ.79,990 ధ‌ర‌కు ఈ ల్యాప్‌టాప్‌ను అమెజాన్ లేదా లెనోవో ఆన్‌లైన్ స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌లో కొన‌వ‌చ్చు. ఆగ‌స్టు 20 నుంచి వినియోగ‌దారుల‌కు ఈ ల్యాప్‌టాప్ ల‌భిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version