తిరుమల ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనదారులపై చిరుత దాడి

-

తిరుమల రెండవ కనుమ దారిలో ద్విచక్రవాహనదారులపై చిరుత దాడి చేసింది. అలిపిరి నుంచి తిరుమలకు చేరుకునే సమయంలో 4వ కిలోమీటరు వద్ద ఇద్దరు ట్రాఫిక్ పోలీసులపై, మరో స్థానికునిపై చిరుత డాడికి దిగింది. చిరుత దాడిని గుర్తించిన కానిస్టేబుల్… దాని నుంచి తప్పించుకుని సురక్షితంగా కొండపైకి చేరుకున్నారు. సమాచారం అందుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది చిరుత దాడికి దిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. కనుమదారిలో ద్విచక్రవాహనాల అనుమతిని తాత్కాలికంగా నిలిపివేశారు.

chirutha

తిరుమల తిరుపతి దేవస్థానం పరిసరాలలో ఎప్పటికప్పుడు అటవీ ప్రాంతం నుంచి జంతువులు, క్రూర మృగాలు సంచరిస్తూ వస్తున్నాయి. కొన్ని సందర్భాలలో స్థానిక ప్రజలపై, భక్తులపై ఎప్పటికప్పుడు దాడులు జరుగుతూనే ఉన్నాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో పలుమార్లు క్రూర మృగాలు భక్తులపై దాడి చేస్తూనే ఉన్నాయి. అధికారులు కూడా కొంతమేరకు చర్యలు తీసుకుంటూనే వస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version