ఓవైపు దేశంలో వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతోంది. మరోవైపు రోడ్డు ప్రమాదాల్లో మనుషులతో పాటు జంతువులు కూడా మృత్యువాత పడుతున్నాయి. వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతున్నా వాటి సంరక్షణకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఓ వాహనం ఢీకొట్టి ఏడాదిన్నర వయసు గల చిరుతుపలు మృతి చెందింది.
సదాశివనగర్ మండలం దగ్గి అటవీప్రాంతంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ చిరుత పులి మృత్యువాత పడింది. ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. మృతిచెందిన చిరుత వయసు ఏడాదిన్నర నుంచి రెండేళ్లు ఉంటుందని అంటున్నారు.
చిరుత రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం దాన్ని ఢీకొని ఉంటుందని భావిస్తున్నారు. చిరుత కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా అటవీశాఖ కార్యాలయానికి తరలించారు.