రాజకీయ పార్టీల నిర్వహణ అన్నది అంత సులువు కాదు. అందుకు చాలా సమర్థతతో పాటు జాగ్రత్తలు కూడా అవసరం. తప్పు ఎవరు చేసినా నింద మోయాల్సింది ఆ పార్టీ నిర్వాహకుడే ! ఇప్పుడు నాగబాబు కూతురు నిహారికా తప్పు చేసిందా లేదా అన్నది కాదు అసలు నిందను మాత్రం కొంత కాలం భరించక తప్పదు. పవన్ నే టార్గెట్ చేస్తూ శత్రు మూకలు ఇప్పుడు కావాల్సినంత మాట్లాడొచ్చు. ఇదే ఇవాళ్టి ఇష్యూ.. ట్రోల్ టాపిక్ కూడా ! ఆమె అక్కడికి వెళ్లకుంటే ఈ గొడవే లేదు.
“శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగేంత మూర్ఖత్వం మనది…
అవతలివాడు మనల్ని వాడుకోవడమే మన విజయం
అని భ్రమ పడేంత అమాయకత్వం కూడా మనదే…”
ఇప్పుడీ మాటలు వైరల్ అవుతున్నాయి. పవన్ చేసిన ట్విట్లో మాటలు ఇవి. ఇవే ఇప్పుడు ఆలోచింపజేస్తున్నాయి. డ్రగ్ కేసులో ఎందరెందరో ఇరుక్కుపోయేందుకు, అందుకు తగ్గ అనేక అనుమానాలకు తావిస్తున్న రీతిలో నిహారిక ఇప్పుడొక సెంటర్ పాయింట్ అయింది.ఎప్పటి నుంచో ఉన్న ఈ డ్రగ్ రాకెట్ రాత్రికి రాత్రి వచ్చింది కాకపోయినా పబ్ కల్చర్ ను కంట్రోల్ చేయడం ఓ సమస్యగా మారడంతో ప్రముఖులకు ఇవి సులువు అవుతున్నాయి. వాస్తవానికి ఆమె డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్నది తరువాత లేట్ నైట్ పార్టీలలో నిహారికా ఉండడమే సిసలు సమస్య.
వాస్తవానికి ఉగాది వేళ అర్ధరాత్రి 12 దాటిన తరువాత అనుమతి లేని వేళలలో పబ్ నడపడం ఓ నేరం. ఇదే సందర్భంలో చాలా మంది అక్కడ కొకైన్ తీసుకున్నారని తెలుస్తోంది. పబ్ లో ఉన్న 150 మందికీ పరీక్షలు తప్పవు. ఇదే కోవలో ల్యాబ్ టెస్టులకు నిహారికా, రాహుల్ సిప్లిగంజ్ లాంటి వారూ వెళ్లాల్సిందే! ఆ రోజు ఆమె ఎలా ప్రవర్తించారు లేదా ఆ సమయంలో ఆమె డ్రగ్ తీసుకోవాలని ఎవ్వరైనా ప్రేరేపించారా లాంటి విషయాలు కూడా వెలుగులోకి రానున్నాయి. దర్యాప్తు పూర్తి స్థాయిలో సాగితే ఇవన్నీ వెలుగు చూస్తాయి. ఇప్పటికే డ్రగ్స్ కేసులో పూరీ, రానా, రవితేజ, ఛార్మీ లాంటి వారు రెండు మూడు పర్యాయాలు
దర్యాప్తు బృందాల విచారణను ఎదుర్కొన్నారు.ఇప్పుడిదే తరహాలో నిహాని ఇంట్రాగేట్ చేయనున్నారా లేదా అన్నది కూడా తెలియాలి. ఏదేమయినప్పటికీ కొణెదల కుటుంబంలో ఇబ్బందుల్లో పడింది. మీడియా అదే పనిగా టార్గెట్ చేసేందుకు అవకాశం ఉన్న విధంగా నిహా ప్రవర్తన ఉండడమే అందుకు కారణం.