తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక భేటీ… ఈ రోజు రాహుల్ గాంధీతో సమావేశం

-

తెలంగాణ కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం కానున్నారు. ఈరోజు రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఇప్పటికే సీనియర్ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక నజర్ పెట్టింది. ఇప్పటికే ఒకసారి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ, బలరాం నాయక్, వేణుగోపాల్, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మల్లు రవి తదితరులు 14 మంది భేటీ అయ్యారు. 

తాజాగా ఈరోజు మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను నేతలు రాహుల్ గాంధీకి వివరించనున్నారు. దీంతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, వరి ధాన్యం కొనుగోలు అంశాలపై చర్చ జరగనుంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో అసంత్రుప్త నేతలు కూడా తమ ఫిర్యాదులను రాహుల్ గాంధీ ముందు ఉంచనున్నారు. గతం కొంత కాలంగా పీసీసీ చీఫ్ పై బహిరంగంగానే విమర్శలు కురిపిస్తున్న జగ్గారెడ్ది కూడా నిన్ననే కుటుంబసమేతంగా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version