నిజామాబాద్‌లో ప్రజావాణి కార్యక్రమం తాత్కాలిక వాయిదా

-

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా పడింది.ఈ విషయాన్ని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

జిల్లా కేంద్రంలో రేపు రైతు మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉన్నందున ఈనెల 21న జరగాల్సిన ప్రజావాణిని వాయిదా వేసినట్లు వెల్లడించారు.ఈనెల 28వ తేదీ నుంచి తిరిగి యథావిధిగా ప్రతి సోమవారం ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు.ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news