ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్‌జీ కొత్తగా వింగ్, వెల్వెట్ పేరిట రెండు నూతన స్మార్ట్ ఫోన్లను భారత్‌లో విడుదల చేసింది. రెండు ఫోన్లలోనూ అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ రెండు ఫోన్లు ఇప్పటికే పలు దేశాల్లో లభిస్తుండగా.. ఎల్‌జీ వీటిని భారత్‌లో బుధవారం విడుదల చేసింది.
ఎల్‌జీ వింగ్ స్పెసిఫికేషన్స్…
* 6.8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ పి-ఓలెడ్ డిస్‌ప్లే, 2440 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 765జి ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
* 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10
* 64, 13, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ పాపప్ ఫ్రంట్ కెమెరా
* ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి ఆడియో
* వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్, వైర్‌లెస్ చార్జింగ్
ఎల్‌జీ వెల్వెట్ 4జి స్పెసిఫికేషన్స్…
* 6.8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
* 1 టీబీ ఎక్స్‌పాంబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10, డ్యుయల్ సిమ్
* 48, 8, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్
* డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0
* ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్
ఎల్‌జీ వింగ్ స్మార్ట్ ఫోన్ అరోరా గ్రే, ఇల్యూషన్ స్కై కలర్ ఆప్షన్లలో విడుదల కాగా.. దీని ధర రూ.69,990గా ఉంది. నవంబర్ 9 నుంచి ఆన్‌లైన్, ఆఫ్ లైన్ స్టోర్స్‌లో దీన్ని విక్రయిస్తారు. అలాగే ఎల్‌జీ వెల్వెట్ 4జి స్మార్ట్ ఫోన్ ధర రూ.36,990 ఉండగా, ఇదే ఫోన్‌కు చెందిన డ్యుయల్ స్క్రీన్ కోంబో వేరియెంట్ ధర రూ.49,990గా ఉంది. దీన్ని అక్టోబర్ 30 నుంచి విక్రయిస్తారు.