లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఐసీ) తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది. ల్యాప్స్ అయిన పాలసీలను రివైవ్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. అలాగే ప్రీమియంపై రాయితీని కూడా అందిస్తోంది. ఆగస్టు 10 (సోమవారం) నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు ల్యాప్స్ పాలసీ రివైవ్ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
ఎల్ఐసీలో ప్రీమియంలు చెల్లించకుండా ల్యాప్స్ అయిన పాలసీలను కస్టమర్లు మళ్లీ రివైవ్ చేసుకుని పొందవచ్చు. మొదటగా ప్రీమియం చెల్లించని తేదీ నుంచి 5 ఏళ్ల లోపు ల్యాప్స్ అయిన పాలసీలను ఈ క్యాంపెయిన్‌లో భాగంగా కస్టమర్లు రివైవ్ చేసుకోవచ్చు. ఇక పలు ఎంపిక చేసిన పాలసీలను మాత్రమే రివైవ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. టర్మ్ అషురెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, మల్టిపుల్ రిస్క్ పాలసీలకు రివైవ్ వర్తించదని ఎల్ఐసీ పేర్కొంది.
ఇక ల్యాప్స్ అయిన పాలసీలకు గాను ప్రీమియం విలువ రూ.1 లక్ష వరకు ఉంటే 20 శాతం రాయితీ ఇస్తారు. దీని వల్ల గరిష్టంగా రూ.1500 వరకు రాయితీ లభిస్తుంది. అదే ప్రీమియం విలువ రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల మధ్య ఉంటే 25 శాతం వరకు రాయితీ ఇస్తారు. ఇందులో గరిష్టంగా రూ.2వేల వరకు పొందవచ్చు. అదే ప్రీమియం విలువ రూ.3 లక్షలకు పైన ఉంటే 30 శాతం వరకు రాయితీ (గరిష్టంగా రూ.2500) పొందవచ్చు.