చాలా మంది ఎవరికి నచ్చిన స్కీమ్స్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీని వలన భవిష్యత్తు లో ఏ సమస్య రాకుండా ఉంటుంది. దేశీయ దిగ్గజ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసీ మరో కొత్త ప్లాన్ ని తీసుకొచ్చింది. ఇక మరి దీని కోసం పూర్తి వివరాలని చూస్తే…
వ్యక్తిగత పొదుపు తో పాటు లైఫ్ ఇన్యూరెన్స్ వంటి లాభాలని కూడా పొందవచ్చు. జీవన్ ఆజాద్ లిమిటెడ్ పీరియడ్ పేమెంట్ ఎండోమెంట్ ప్లాన్ వలన అదిరే బెనిఫిట్స్ ని పొందవచ్చు. ఒకవేళ కనుక ఈ ప్లాన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే అతడి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. మెచ్యూరిటీ వరకు జీవించి ఉంటే గ్యారెంటీ ఇచ్చిన మొత్తాన్ని ఒకేసారి ఇస్తారు.
ఇక వయస్సు విషయానికి వస్తే.. 90 రోజుల నుంచి గరిష్ఠంగా 50 ఏళ్లు వున్నవాళ్లు దీన్ని తీసుకోవచ్చు. కనిష్ఠంగా సమ్ అష్యూర్డ్ రూ.2 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.5 లక్షలు దీనిలో పెట్టచ్చు. పాలసీ కాల వ్యవధి 15 నుంచి 20 ఏళ్ల వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ పాలసీ ప్రీమియం ఏడాది, ఆరు, మూడు నెలల తో పాటు నెల నెల చెల్లించవచ్చు. 20 ఏళ్ల పాలసీ టర్మ్ ని తీసుకున్నట్లయితే 8 ఏళ్లు మినహాయించి మిగిలిన 12 ఏళ్లు ప్రీమియం పే చెయ్యాలి.