పుతిన్ బతికే ఉన్నారా అంటూ జెలెన్‌స్కీ ప్రశ్న.. రష్యా స్ట్రాంగ్ రిప్లై

-

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యా అధ్యక్షుడు పుతిన్​పై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఆ సదస్సులో జరిగిన అల్పాహార కార్యక్రమంలో జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. ‘ఇప్పుడు నాకు ఎవరితో మాట్లాడాలో, దేని గురించి మాట్లాడాలో అర్థం కావడం లేదు. రష్యా అధ్యక్షుడు జీవించి ఉన్నారో లేదో నాకు కచ్చితంగా అర్థంకావడం లేదు. ఆయన జీవించి ఉన్నారా..? నిర్ణయాలు తీసుకుంటున్నారా..? నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మనం శాంతి చర్చల గురించి ప్రస్తావన తెచ్చినప్పుడు..వాటిని ఎవరితో జరపాలో నాకు తెలియట్లేదు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఉక్రెయిన్‌కు చెందిన ఆన్‌లైన్ మీడియా సంస్థ ప్రచురించింది.

ఈ వ్యాఖ్యలపై.. రష్యా వైపు నుంచి గట్టి సమాధానం వచ్చింది. ‘ఉక్రెయిన్‌, జెలెన్‌స్కీకి..రష్యా, పుతిన్‌ అతి పెద్ద సమస్య అని ఇప్పుడు స్పష్టమైంది. రష్యా, పుతిన్‌ ఉనికిలో ఉండకూడదని ఆయన కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. రష్యా ఉనికిలో ఉందని, ఎప్పటికీ ఉంటుందని ఆయన ఎంత త్వరగా గ్రహిస్తే.. ఉక్రెయిన్‌కు అంత మంచిది’ అని బదులిచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news