LIC అదిరే పాలిసీ..నాలుగేళ్లలో డబ్బే డబ్బు..!

-

చాలా మంది ఎన్నో రకాల స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. మీరు కూడా మీకు నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెట్టాలని అనుకుంటున్నారా..? అయితే లైఫ్‌ ఇన్స్‌రెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా అందించే స్కీమ్ లో డబ్బులు పెట్టచ్చు. ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. మంచిగా లాభాలు వస్తాయి. LIC అందించే స్కీమ్స్ లో జీవన్ శిరోమణి పాలిసీ కూడా ఒకటి.

ఇందులో డబ్బులు పెడితే లాభాలు ఎక్కువ వస్తాయి. రిస్క్ అయితే ఉండదు. ఈ పాలసీ కాలపరిమితి 14, 16, 18, 20 సంవత్సరాలు. ప్రీమియం 4 సంవత్సరాలు మాత్రమే చెల్లించాలి. ఇక ప్రీమియం కోసం చూస్తే.. ప్రతి సంవత్సరం, అర్ధ సంవత్సరం, త్రైమాసికం లేదా ప్రతి నెలా ప్రీమియం డిపాజిట్ చెయ్యచ్చు. ఎవరు అర్హులు అన్నది చూస్తే 18 ఏళ్లు నిండిన వారు ఈ పాలసీని తీసుకోవచ్చు.

14 ఏళ్ల పాలసీ కి 10వ,12వ సంవత్సరంలో హామీ మొత్తంలో 30-30 శాతం… 16 ఏళ్లు అయితే 12వ,14వ సంవత్సరాలలో 35-35% బీమా హామీ ఉంటుంది. ఇదిలా ఉంటే 18 సంవత్సరాల పాలసీకి 14వ, 16వ సంవత్సరాలలో 40-40% బీమా హామీ ఉంటుంది. 20 సంవత్సరాల పాలసీకి 16వ, 18వ సంవత్సరాల హామీ మొత్తం 45- 45% డబ్బు అందుతుంది. ఐదు సంవత్సరాలలోపు సబ్‌స్క్రైబర్ మరణిస్తే సమ్ అష్యూర్డ్ , గ్యారెంటీడ్ అడిషన్ ఇస్తారు. అదే 5 సంవత్సరాల తర్వాత, మెచ్యూరిటీకి ముందు కస్టమర్‌ మరణిస్తే మొత్తం గ్యారెంటీ అదనం, లాయల్టీ అదనంగా ఇస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version