తెలంగాణ మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాదులో రెండు రోజులపాటు లిక్కర్ షాపులు క్లోజ్ కానున్నాయి. రేపు అలాగే ఎల్లుండి రెండు రోజులపాటు మద్యం దుకాణాలు మూసివేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు హెచ్చరించారు. హైదరాబాద్ మహానగరంలో రేపు అలాగే ఎల్లుండి బోనాల పండుగ జరగనుంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే సోమవారం అధికారిక హాలిడే కూడా ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇలాంటి నేపథ్యంలో రేపు ఎల్లుండి మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు సందర్భంగా ఈ నెల 21న అంటే సోమవారం రోజున పబ్లిక్ హాలిడే ప్రకటించారు. ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలతో పాటుగా ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ఉండబోతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి జంట నగరాలలో సోమవారం లిక్కర్ షాపులు కూడా మూసివేస్తున్నారు. రేపు ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజులు హాలిడే వచ్చింది.