ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే!

-

మీకు తెలుసా? కేవలం ఒక సంవత్సరం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై మదుపు చేసుకుంటే అధిక వడ్డీ వస్తోంది. అందుకే సంవత్సరానికి ఎఫ్‌డీ చేసుకోవడమే మేలు. ఆ వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా మనం మదుపు చేసుకునేదే అధిక రాబడి కోసం. కానీ, పూర్తి డబ్బు కాకుండా కొద్ది మేర లిక్వీడ్‌ రూపంలో దాచుకోవడం మేలే కదా! అవి అత్యవసర పరిస్థితుల్లో అవసరమవుతుంది. అంటే ఈ ఎఫ్‌డీలు అధిక రాబడితో పాటు భద్రతను కూడా అందిస్తున్నాయి.

india banks list

అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు..

  • ఒక ఏడాది మెచూరిటీ ఎఫ్‌డీలపై ఆర్‌బీఎల్‌ బ్యాంకు 6.10 శాతం వడ్డీ అందిస్తో్ది. అంటే ఒకవేళ లక్ష రూపాయలు మదుపు చేస్తే, ఏడాది తర్వాత డిపాజిటర్లు రూ.6,241 అసలుతోపాటు పొందుతారు.
  • ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 6.00 శాతం వడ్డీనిస్తుంది. ఇందులో లక్ష రూపాయలు మదుపు చేస్తే ఏడాదికి రూ.6,136 అసలుతోపాటు రాబడిగా పొందుతారు.
  • ఆ తర్వాత జాబితాలో యస్‌ బ్యాంక్‌ కూడా 6.00 శాతం వడ్డీని అందిస్తుంది.
  • ఇక డీసీబీ బ్యాంక్‌ 5.80 శాతం వడ్డీ ఇస్తుంది. అంటే లక్ష మదుపు చేసుకుంటే అసలుతోపాటు రాబడిగా ఏడాదికి రూ.5,937 పొందుతారు.
  • బంధన్‌ బ్యాంక్‌ 5.50 శాతం వడ్డీ ఇస్తుంది. రాబడిగా ఏడాదికి రూ.5,614లు పొందుతారు.

ఇక విదేశీ బ్యాంకుల విషయానికి వస్తే…

  • స్టాండర్డ్‌ ఛార్టర్డ్‌ బ్యాంక్‌ ఏడాది ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు 5.30 శాతం వడ్డీని ఇస్తుంది.
  • డీబీఎస్‌ బ్యాంక్‌ 4.25 శాతం వడ్డీ సంవత్సరం మదుపుతో అందిస్తోంది.
  • డషే బ్యాంక్‌ 3.85 శాతం వడ్డీ తమ వినియోగదారులకు ఇస్తోంది.
  • బీసీ బ్యాంక్‌ 3.10 శాతం వడ్డీ అందించగా …సిటీ బ్యాంక్‌ 2.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
  • ఇక ఐసీఐసీఐ, హెడీఎఫ్‌సీల విషయానికి వస్తే.. ఏడాది ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 4.90 శాతం వడ్డీనిస్తున్నాయి.
  • యాక్సిస్‌ బ్యాంక్‌ ఆఫర్లు 5.10 శాతం, కోటక్‌ మహేంద్ర బ్యాంక్‌ 4.50 శాతం అందిస్తుంది.
  • ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ 4.25 శాతం అందిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version