రైతులకు రుణమాఫీ.. పెద్ద జోక్‌ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

-

రుణమాఫీపై స్పష్టత లేదని వివరాలు అడిగితే అధికారులు గందరగోళానికి గురవుతున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.రైతులకు రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని, కానీ అది ఒక పెద్ద జోక్‌లా కనిపిస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు స్వప్రయోజనాలు చూసుకోవడం తప్ప తెలంగాణ ప్రజల్ని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యవసాయం, సాగునీరుపై సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎవ్వరికీ అవగాహన లేదని,మేడిగడ్డ వద్ద లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతున్నా ఎందుకు ఎత్తి పోయడం లేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం కాల్వలకు నీరు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని , కాళేశ్వరం కొట్టుకుపోతుందని అధికార పార్టీ నేతలు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు.గత యాసంగిలాగా ఈసారి కూడా రైతులకు నీరివ్వకుండా ఎండబెడితే తీవ్ర పరిణామాలు తప్పవని జగదీశ్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు . గోదావరి ఆయకట్టుకు నీళ్లందించే అవకాశం ఉన్నా రైతుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news