అన్ లాక్ 4 మార్గదర్శకాలు విడుదల.. ఈసారి వాటికి పర్మిషన్ !

-

మరో రెండ్రోజుల్లో లాక్ డౌన్ 3 ముగియనుండడంతో లాక్ డౌన్ 4 మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్ర హోం శాఖ. అనుకుంటున్నట్టుగానే దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 7 నుండి మెట్రో సర్వీసులు మొదలు కానున్నాయి. అయితే దశల వారీగా మెట్రో సర్వీసులు ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. అయితే సెప్టెంబర్ 30 దాకా స్కూల్స్ మూసే ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ, మత పరమైన సభలకి సెప్టెంబర్ 21 నుండి పర్మిషన్స్ ఇచ్చారు.

కానీ 100 మందికి మించకుండా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. ఇక అంతర్జాతీయ విమాన ప్రయాణాల మీద ఆంక్షలు కొనసాగనున్నాయి. ఇక ఈ నిబందనలు అన్నీ సెప్టెంబర్ 30 దాకా ఉండనున్నాయి. ఓపెన్ ఎయిర్ థియేటర్ లకి సెప్టెంబర్ 21 నుండి పర్మిషన్స్ ఇచ్చారు. అలానే మామూలు సినిమా థియేటర్స్, స్విమ్మింగ్ పూల్స్ మీద ఆంక్షలు కొనసాగనున్నాయి. అలానే ఇక నుండి కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్రాలు లాక్ డౌన్ విదించకూడదని పేర్కొన్నారు. ఇక ఇప్పటికే అంతర్రాష్ట్ర రవాణా మీద కూడా ఎటువంటి ఆంక్షలు లేవని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version