వైరల్ వీడియో;లాక్ డౌన్ ఉల్లంఘిస్తే మీకు ఉచ్చు పడిపోతుంది…!

-

కరోనావైరస్ లాక్డౌన్ ఉల్లంఘించినవారిని పట్టుకోవటానికి అదే సమయంలో సామాజిక దూరాన్ని పాటించడానికి గానూ… చండీఘడ్ పోలీసుల విఐపి సెక్యూరిటీ విభాగం వినూత్న ఆలోచన చేసారు. పోలీసులు ఐదు అడుగుల పొడవైన లోహపు కడ్డీని తయారు చేసి… దాని చివర నాలుక లాంటి నిర్మాణంతో అమర్చారు. అది లాక్ డౌన్ ని ఉల్లంఘించేవారి నడుము చుట్టూ చుట్టేసుకుంటుంది.

వారు తప్పించుకునే అవకాశం లేకుండా పోతుంది. ఒక వైపున పోలీసులు ఏ ఇబ్బంది పడకుండా పట్టుకునే విధంగా ఉంటుంది. ఉల్లంఘించినవారిని నడుము నుండి పట్టుకోవటానికి ఉచ్చు తెరుచుకుంటుంది. వారు వెంటనే బయటకు తప్పించుకోకుండా లాక్ ఉంటుంది. ఈ విషయాన్ని  డీజీపీ సంజయ్ బనివాల్ ట్విట్టర్లో పోస్ట్ చేసారు. ఆ వీడియో లో ఈ పరికర౦ ఏ విధంగా పని చేస్తుంది అనేది చూపిస్తారు.

పోలీసుల విఐపి సెక్యూరిటీ విభాగంకు సహకరించని వారిని పట్టుకోవడానికి ప్రత్యేక మార్గం తయారు చేసారని చెప్పారు. ఇవి మంచి ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. అంటుకొనే కరోనావైరస్ వ్యాప్తిపై పోరాడటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్చి 24 న దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. ఏప్రిల్ 14 న ఎత్తివేయాలని నిర్ణయించిన లాక్డౌన్ ఇప్పుడు మే 3 వరకు పొడిగించబడింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉన్నప్పటికీ, చాలామంది నిబంధనలను ఉల్లంఘించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version