కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తుంది. ఆ దేశం ఈ దేశం అనే తేడా లేదు. దాదాపు అన్ని దేశాల్లో కూడా కరోనా వైరస్ ప్రజలను అల్లాడిస్తూ వస్తుంది. దీనితో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాలు అన్నీ కూడా లాక్ డౌన్ ని పెంచుతున్నాయి. మన దేశం మే 3 వరకు లాక్ డౌన్ ని పెంచిన సంగతి తెలిసిందే. ఇక అమెరికా, ఫ్రాన్స్, స్పెయిన్ సహా పలు దేశాల్లో లాక్ డౌన్ కొనసాగుతుంది.
స్పెయిన్ లో కరోనా వైరస్ కట్టడి అయినట్టే అయి రోజు రోజుకి విశ్వ రూపం చూపిస్తుంది. తాజాగా అందిన లెక్కల ప్రకారం అక్కడ అమెరికా కంటే ఎక్కువ కేసులు ఉన్నాయి. కరోనా రోజు రోజుకి పెరుగుతున్న నేపధ్యంలో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో లాక్ డౌన్ ని పెంచుతున్నారు. మే 9 వరకు లాక్ డౌన్ ని పెంచారు. లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు స్పానిష్ ప్రధాని పెడ్రో శాంచెజ్ ప్రకటించారు.
స్పెయిన్లో ఇప్పటివరకు 1 లక్ష 91 వేల మంది కరోనా బారిన పడగా మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మరణాల సంఖ్య 20 వేలను దాటింది. ఇక స్పెయిన్ లో ఆస్పత్రులకు కొరత తీవ్రంగా ఉంది. అక్కడ మరణాలు పెరగడం ప్రభుత్వాన్ని కలవర పెడుతుంది.