కరోనా మహమ్మారి విద్యార్థుల పాలిట శాపంగా మారింది. దీనివల్ల ఇప్పటికే రెండు సంవత్సరాలు వృధా అయిపోయాయి. గత ఏడాది పరీక్షలు లేకుండానే గడిచిపోయింది. ఈ ఏడాది అయితే పాఠశాలలు కూడా సరిగ్గా ప్రారంభం కాలేదు. నడిచిన రెండు ముడు నెలలకి కూడా చాలా ప్రభుత్వాలు పరీక్షలను రద్దు చేసాయి. కరోనా థర్డ్ వేవ్ భయం నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం సరికాదని అంటున్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా వేసారు.
అస్సాం, ఏపీ, పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు బోర్డు పరీక్షలు నిర్వహించాలని అనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది వ్యతిరేకత తెలియజేస్తున్నారు. ఇప్పుడది సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది. ఈ రాష్ట్రాల్లో కూడా బోర్డు పరీక్షలను రద్దు చేయాలని, పిల్లల ఆరోగ్యంతో ఆడుకోవద్దని, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్న కారణంగా పరీక్షలను రద్దు చేయాలని సుప్రీం కోర్టుకి వెళ్ళారు. మరి సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.