పార్టీలో కూడా ఆ రోజు ఆయన చేసిన తప్పిదాలే ఇప్పటికీ తమను వేధిస్తున్నాయని ఓ వర్గం నిప్పులు చిమ్ముతోంది. అయ్యన్న లాంటి లీడర్లు అచ్చెన్న లాంటి నమ్మకస్తులు ఇవాళ చంద్రబాబుతో ఉంటారు కానీ లోకేశ్ తో ఉండరు గాక ఉండరు. ముఖ్యంగా జగన్ మాదిరిగానే లోకేశ్ కూడా సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వరని తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రయివేటు సంభాషణల్లో తరుచూ వినిపించే మాట. అదేవిధంగా విషయ జ్ఞానం తక్కువ అని కూడా అంటుంటారు. ఇవాళ మీడియా ఎదుట హల్చల్ చేసినా కూడా క్షేత్ర స్థాయిలో ఆయన మాస్ లీడర్ అని అనిపించుకోవడం కష్టం.
ఇక జగన్ మాదిరిగానే లోకేశ్ కూడా ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారన్నది ఓ విమర్శ ఉంది. తన వర్గంకు చెందిన మనుషులుగా కింజరాపు రామును, చింతకాయల విజయ్ ను ఇంకా ఇంకొందరిని ప్రమోట్ చేస్తారని కూడా టాక్ ఉంది. వీటితో పాటు యువ నాయకత్వంలో కొందరిని తనకు అనుగుణంగా వాడుకుని గతంలో పార్టీ పదవులు అందించారని, అదే సమయంలో సీనియర్లకు ఇవ్వాల్సిన గౌరవం ఆయన ఇవ్వలేదని కూడా అంటారు. అందుకే చంద్రబాబు అంటే తమకు అభిమానం ఉన్నా కొందరు ముఖ్యంగా కొడాలి నాని లాంటి లీడర్లు కేవలం లోకేశ్ తీరు నచ్చకనే వెళ్లిపోయారు. వల్లభనేని వంశీ కానీ కేశినేని నాని కానీ ఇంకా ఇంకొందరు లోకేశ్ ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఎంపీ కేశినేని నాని బాహాటంగానే అధినేత తీరుపై నిప్పులు చెరిగారు.
అదే సమయంలో లోకేశ్ పై కూడా కొన్ని విమర్శలు ప్రయివేటు సంభాషణల్లో చేశారని టాక్. అవన్నీ బయటకు వచ్చాకనే అధినేత దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ ప్రముఖ మీడియా అధినేత (టీవీ నైన్ రవి ప్రకాశ్ )తో చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగిన ఆయన తీరా ఆ మీడియా అధినేత ఇబ్బందుల్లో
ఇరుక్కుంటే కనీసం పట్టించుకున్న దాఖలాలు కూడా లేవని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అందుకే వేమూరి రాధాకృష్ణ లాంటి మీడియా పర్సన్స్ కూడా లోకేశ్ ను ప్రోత్సహించరు అన్నది ఓ బహిరంగ విమర్శ పార్టీలోనే ఉంది. చాలా వరకూ యూజ్ అండ్ త్రో మోడ్ లో రాజకీయం నడిపే వారిలో లోకేశ్ కూడా ఒకరని అప్పట్లో వైసీపీ నుంచి విన్న విమర్శ. కానీ ఇప్పుడు ఆయన మారారని అంటుంటారు.