చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన అనంతరం రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ నేతల నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. ఊహించని ఈ ఘటనకు షాక్ అయిన నారా లోకేష్ హుటాహుటిన తాను చేస్తున్న యువగలం ఆపాదయాత్రను తాత్కాలికంగా ఆపివేసి విజయవాడ కు చేరుకున్నారు. తండ్రిని చూడాలని ప్రయత్నించినా పోలీసులు అనుమతించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసారు లోకేష్. ఇక చేసేది ఏమీ లేక ఉండవల్లి లోని తన నివాసానికి చేరుకున్న లోకేష్ తండ్రిని ఎలాగైనా బయటకు తీసుకురావాలని తమ న్యాయవాదులతి కలిసి బెయిలు తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మరి ఈ రోజు రేపు ప్రభుత్వ సెలవులు కావడం వలన ఖచ్చితంగా సోమవారం వరకు అయితే బెయిల్ వచ్చే ప్రసక్తే లేదని తెలుస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ రోజు చంద్రబాబును అరెస్ట్ చేసినట్లుగా ప్రతిపక్షాలు చెబుతున్నాయి.
ఇటువంటి పరిస్థితుల్లో లోకేష్ ఏమి చేయనున్నాడు అన్నది టీడీపీ నేతల మదిలో మెదులుతోంది. కాగా ఈ అరెస్ట్ చట్టవిరుద్ధం అంటూ కొందరు చెబుతున్నారు..