జనం చూస్తున్నారు… మరీ అంత ఓపెన్ గా చెప్పేస్తే ఎలా లోకేశ్!

-

గత కొన్ని రోజులుగా దూకుడు పెంచారు నారా లోకేశ్. కరోనా సమయంలో సుధీర్ఘ విశ్రాంతి అనంతరం మీడియా ముందుకు ఒక బుక్కు పట్టుకుని వచ్చారు లోకేశ్. విధ్వంశానికి వన్ ఇయర్ అంటూ జగన్ పై దూకుడు ప్రదర్శించారు. ఈ క్రమంలో లాజిక్కులు లేని కొన్ని మాటలు కూడా మాట్లాడి జనాలకు జబర్ధస్త్ షో లేని లోటు తీర్చే ప్రయత్నం చేశారనే కామెంట్లూ పడ్డాయి! ఈ క్రమంలో తాజాగా లోకేశ్ రెండు చోట్ల నోరు జారారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అవినీతికేసులో అచ్చెన్నాయుడిని పరామర్శించడానికని వెళ్లిన లోకేష్.. అనుమతి లేకపోయే సరికి వెనక్కి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కడప జైల్లో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో అదే చేదు అనుభవం ఎదురైంది! ఈ క్రమంలో తగ్గేది లేదని చెబుతూ… జేసీ బ్రదర్స్ ఇంటికి వెళ్లి వారి కుటుంబాబ సభ్యులను పరామర్శించారు. ఈ క్రమలోనే లోకేశ్ రెండు మాటలు జారారని అంటున్నారు. వాటిలో ఒకటి… ఫైబర్ నెట్ గురించి కాగా, మరొకటి వడ్డీ తీచ్రుకోవడం గురించి.

ముందుగా ఫైబర్ నెట్ విషయంపై స్పందించిన లోకేశ్… ఫైబర్ నెట్ కు సంబందించిన ప్రాజెక్టు గురించి తనను త్వరలో అరెస్టు చేస్తారని ఏపీ మంత్రులు చెబుతున్నారని… అసలు ఆ ప్రాజెక్టుకు, తాను పనిచేసిన శాఖకూ సంబందం లేదని చెబుతున్నారు! ఈ క్రమంలో… తన శఖకు – ఆ కేసుకూ సంబందం లేదంటున్నారేతప్ప… తనకూ ఆ ఫైబర్ నిట్ ప్రాజెక్టుకూ సంబందం లేదనే విషయం లోకేశ్ బలంగా చెప్పలేకపోతున్నారని అంటున్నారు వైకాపా నేతలు. లోకేశ్ అక్రమాలు… తన శాఖకు మాత్రమే పరిమితమయ్యయని అని తాము అనుకోవడం లేదని.. అలా అనుకుంటే అంతకుమించిన అమాయకత్వం, అవగాహనా రాహితయం మరొకటి ఉండదని చెబుతున్నారు.

ఈ క్రమంలో మరో మాట అన్నారు లోకేశ్… “వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం” అని! అంటే… భవిష్యత్తులో ఎప్పుడైనా తాము అధికారంలోకి వస్తే.. అప్పుడు మీపై కూడా కేసులు పెడతామని అన్నమాట! ఇప్ప్పుడు జగన్ చేస్తున్న పనులను, ఏసీబీ అరెస్టులను రాజకీయ కక్ష సాధింపులుగా అభివర్ణిస్తున్న లోకేశ్… తాముకూడా రాజకీయ కక్షసాధింపులకు పాల్పడతామని ఓపెన్ గానే చెబుతున్నారన్నమాట. ఇదే క్రమంలో.. తాము గతంలో కూడా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డామని ఓపెన్ గా ఒప్పేసుకుంటున్నారన్న మాట.. అని పలువురు అభిప్రాయపడుతున్నారు! జనం చూస్తున్నారు తమ్ముళ్లూ!!

Read more RELATED
Recommended to you

Exit mobile version