లోకేష్‌ పాదయాత్రకు కండిషన్ అప్ప్లై..పవన్‌కు షాక్!

-

లోకేష్ పాదయాత్రకు పర్మిషన్ లభించిన విషయం తెలిసిందే..ఇటీవల జీవో నెంబర్ 1 తీసుకురావడంతో పాదయాత్రపై పలు ఆంక్షలు పెట్టారు. ఆ జీవో ప్రకారం రోడ్లపై సభలు నిర్వహించడానికి వీలు లేని విషయం తెలిసిందే. అలాగే పాదయాత్ర జరిగే ప్రతి సబ్-డివిజన్ పరిధిలో డి‌ఎస్‌పి ద్వారా పాదయాత్రకు అనుమతి తీసుకోవాల్సి ఉంది. మామూలుగా గతంలో జగన్ పాదయాత్రకు ఈ ఆంక్షలు లేవు..డి‌జి‌పి అనుమతి ఇస్తే..రాష్ట్రం వ్యాప్తంగా ఇబ్బంది ఉండదు.

కానీ లోకేష్ పాదయాత్రకు డి‌జి‌పి పర్మిషన్ ఇవ్వలేదు..స్థానిక డి‌ఎస్‌పిలు వద్ద పర్మిషన్ తీసుకోవాలి. ఎక్కడకక్కడ ఇదే పరిస్తితి ప్రతి సబ్-డివిజన్ పరిధిలో డి‌ఎస్‌పిలని కలిసి పర్మిషన్ తీసుకోవాలి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పర్మిషన్ తీసుకోవాలి. అలాగే రాష్ట్ర, జాతీయ రహదారులపై పావు వంతు రోడ్డులోనే పాదయాత్ర చేయాలి..అలాగే రోడ్లపై సభలకు అనుమతి లేదు..రోడ్లు పక్కన ఉండే ఖాళీ ప్రదేశాల్లో సభలు నిర్వహించుకోవాలి. ఇలా లోకేష్ పాదయాత్రపై పలు ఆంక్షలు పెట్టారు.

ఇక ఈ ఆంక్షలతో పవన్‌కు ఓ రకంగా షాక్ తగిలినట్లే అని చెప్పవచ్చు. పవన్ వారాహితో బస్సు యాత్రకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే బస్సు యాత్ర అంటే ఇంకా రోడ్లపైనే చేయాలి..సభలు కూడా రోడ్లపై పెట్టుకోవాలి. కానీ రోడ్లపై సభలకు అనుమతి లేదు. మరి అలాంటప్పుడు పవన్ బస్సు యాత్రకు ఎలాంటి ఆంక్షలు పెడతారనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో హైకోర్టు గాని జీవో నెంబర్1 ని కొట్టేస్తే..అప్పుడు లోకేష్, పవన్‌లకు ఇబ్బంది ఉండదు..అలా కాకుండా ఆ జీవో అలాగే ఉంటే పరిస్తితి వేరేగా ఉంటుంది.

జనవరి 27 నుంచి కుప్పంలో లోకేష్ పాదయాత్ర మొదలవుతున్న విషయం తెలిసిందే. అటు పవన్ వారాహి బస్సుకు కొండగట్టు ఆంజనేయస్వామి వద్ద పూజలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పవన్ బస్సు యాత్ర తేదీలు ఇంకా ఖరారు కాలేదు. మొత్తానికి లోకేష్ పాదయాత్ర, పవన్ బస్సు యాత్రపై వైసీపీ ప్రభుత్వం ఆంక్షలు కంటిన్యూ అయ్యేలా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version