లోక్సభ ఎన్నికలకి షెడ్యూల్ ఎప్పుడు వెలవడిబోతుంది అనేది అన్ని పార్టీలు ఉత్కంఠంగా చూస్తున్న సెకండ్ వీక్ లో ఎప్పుడైనా రిలీజ్ కావచ్చని అంచనాలతో ఉన్నాయి. ఈనెల 11న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఇద్దరు కమిషనర్లు పలువురు అధికారులు అన్ని రాష్ట్రాల్లోనూ సీఈవోలు సెంట్రల్ ఎలక్షన్ అబ్జర్వేషన్ తో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
లోక్సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కొన్ని సూచనలు ఆదేశాలు ఇవ్వనున్నారు అప్పటివరకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది. దీనికి తోడు ఈ నెల 13న మోడీ జమ్ము కాశ్మీర్ పర్యటన ఉందని అది ముగిశాక షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికలతో పాటే జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ కూడా ఎన్నికలు నిర్వహించబోతోంది అని రాష్ట్రాల్లో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం సెంట్రల్ కమిషన్ అబ్జర్వేషన్లని ఖరారు చేసింది.