న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో మళ్లీ అదే రచ్చ కొనసాగింది. ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్ల ట్యాంపిగ్
వ్యవహారం పార్లమెంట్ ఉభయసభలను కుదిపేస్తోంది. రెండు ఉభయ సభల్లోనూ పెగాసస్ పై చర్చ జరపాలని ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టాయి. దీంతో వరుసగా పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడుతున్నాయి. మరే ఇతర అంశాలు చర్చకు రాకుండానే లోక్‌సభ, రాజ్యసభ వాయిదా పడుతున్నాయి.
ఇవాళ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకాగానే రెండు సభలు పెగాసస్ రచ్చతో దద్దరిల్లిపోయాయి. లోక్ సభలో స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లి కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. పెగాసస్ పై చర్చ జరిపి… దర్యాప్తునకు ఆదేశించాలని పట్టుబట్టాయి. దీంతో స్పీకర్ ఓం బిర్లా లోక్ సభను వాయిదా వేశారు.
మరోవైపు రాజ్యసభలోనూ పెగాసస్ అంశం దుమారం రేపింది. ప్రతిపక్ష పార్టీలు చైర్మన్ వైపు వెళ్లి నినాదాలు చేశారు. ప్రతి రోజూ ఇలానే చేస్తుండంతో చైర్మన్ వెంకయ్యనాయుడు ఒకింత అసహనం చేశారు. కాంగ్రెస్ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సమావేశంలో పలువరు సభ్యులను సస్పెండ్ చేశారు. వారిపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఈ రోజు సభలో పేర్కొన్నారు. ఎంతకీ ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో రాజ్యసభను కూడా వెంకయ్యనాయుడు వాయిదా వేశారు.