సాధారణంగా ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ అందుబాటులోకి వచ్చాక ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇది వరకు టెక్నాలజీ అభివృద్ధి కాక ముందు ఏ సమస్యలు లేవు. టెక్నాలజీ అభివృద్ధి అయిన తరువాత మోసాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఆన్ లైన్ లో మోసం చేసే వారు కొందరూ అయితే.. కొందరూ లోన్లు ఇస్తామని ప్రత్యేక యాప్ లు పెడుతుంటారు. యాప్ ల ద్వారా లోన్లు ఇచ్చి.. ఆ తరువాత వేధింపులకు పాల్పడటం, తిట్లు తిడుతుంటారు.
ఇలా కొంత మంది వారి వేధింపులకు భరించలేక ఆత్మహత్య చేసుకొని మరణించారు. తాజాగా విశాఖ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. విశాఖ – అంగడి దిబ్బకు చెందిన నరేంద్ర(21)కు 40 రోజుల కిందే పెళ్లి జరిగింది. అతను లోన్ యాప్ నుంచి కొంత అప్పు తీసుకున్నాడు. నగదు అంతా కట్టి చివరకు రూ.2 వేలు పెండింగ్ లో ఉండగా.. లోన్‌యాప్ నిర్వాహకులు వేధించారు. తన ఫోటో, తన భార్య ఫోటోను మార్ఫింగ్ చేసి కుటుంబ సభ్యులకు, బంధువులకు పంపడంతో మనస్తాపానికి గురైన నరేంద్ర ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.