శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్ లో పర్యటించబోతున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్ల పై సీఎస్ శాంతికుమారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

రాష్ట్రపతి నిలయంలో ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై అటవీ, జీహెచ్ఎంసీ, పోలీస్, ఆర్అండ్ బీ, ఎంఏయూడీ, ఇంధన శాఖ అధికారులకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్షలో డీజీపీ జితెందర్, హోం స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రవి గుప్త, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆర్అండ్ బీ వికాస్ రాజ్, ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, జీఏడీ సెక్రెటరీ రఘునందన్ రావు, స్పెషల్ కమిషనర్, ఐఅండ్ పీఆర్ హరీశ్, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్ రావు అధికారులు పాల్గొన్నారు.