వంగవీటి రాధాకృష్ణ గురించి దాదాపు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన తొలిసారిగా 2004లో కాంగ్రెస్ పార్టీ తరుపున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తరువాత 2008లో ప్రజా రాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీలో చేరి ఓడిపోయాడు. ఆ తరువాత 2019లో తెలుగుదేశం పార్టీలో చేరాడు.
2019 నుంచి 2024 జూన్ వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. 2024 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీ చేరుతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అలాంటిది ఏమి జరగలేదు. తాజాగా వంగవీటి రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును కలిశారు. జనసేన తరపున రాజ్యసభ సభ్యులు, నాగబాబుకు మంత్రి పదవీ ప్రకటన చేసిన తరుణంలోనే ఇవాళ సీఎం చంద్రబాబును వంగవీటి కలువనున్నారు. వంగవీటి కి కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్సీ పదవీని ఆఫర్ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వారి మధ్య భేటీలో ఏయే అంశాలు చర్చకు వస్తాయనే దానిపై ఆసక్తి నెలకొంది.