ముషీరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంగా వచ్చిన లారీ బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్ – ముషీరాబాద్ జంక్షన్ వద్ద పార్క్ చేసిన వాహనాలపైకి ఒక్కసారికి దూసుకొచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు.
ఈ ఘటనలో అబ్దుల్లా అనే వ్యక్తి మృతి చెందగా, గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ రోడ్డు ప్రమాదంలో ముషీరాబాద్ పోలీస్ వాహనంతో పాటు పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.