కర్ణాటకలో లారీ బోల్తా.. 10 మంది మృతి, 15 మందికి గాయాలు

-

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ఘటనలో 10 మంది కూరగాయలు అమ్ముకునే రైతులు మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాదానికి గురైన లారీ కూరగాయలు విక్రయించేందుకు సవనూరు నుంచి కుంట మార్కెట్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

Tragedy in New Year celebrations

స్థానిక జిల్లా ఎస్పీ నారాయణ కథనం ప్రకారం.. బుధవారం తెల్లవారు జామున కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడలోని ఎల్లపూర్ తాలూకా అరేబైల్-గుల్లాపురా మధ్య గల నేషనల్ హైవే 63పై కూరగాయలతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా..మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version