ఆహారంతో పాటు నీళ్లను త్రాగడం మంచిదేనా?

-

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో, సరైన పద్ధతిలో ఆహారాన్ని నీరుని తీసుకోవడం కూడా అంతే అవసరం. చాలా శాతం మంది ఆహారం తీసుకుంటూ మధ్యలో నీళ్లను తాగుతూ ఉంటారు. అయితే ఇలా చేయడం వలన ఆహారం జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుందని కొందరు అంటూ ఉంటారు. అయితే మరి కొందరు ఆహారంతో పాటు నీరుని తీసుకోవడం వలన త్వరగా జీర్ణం అవుతుంది అని భావిస్తారు. అయితే ఆహారం తినే సమయం లో నీరును అస్సలు తీసుకోకూడదు అని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం వలన ఆహారం జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది.

ఎందుకంటే ఎప్పుడైతే ఆహారంతో పాటు నీరుని తీసుకుంటారో జీర్ణ రసాలు తగ్గిపోతాయి. దానివలన జీర్ణశక్తి తగ్గిపోతుంది. దీంతో గ్యాస్, జీర్ణకోశ సమస్యలు వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఆహారం త్వరగా జీర్ణం అవ్వాలి అంటే ఆహారం తీసుకునే 30 నిమిషాల కంటే ముందు నీరును తాగాలి లేదా ఆహారం తీసుకున్న గంట తర్వాత నీరును తీసుకోవాలి. ఆహారంతో పాటు నీరుని తీసుకోవడం వలన జీర్ణాశయ అగ్ని తగ్గిపోతుంది. దీంతో పాటు ఆహారంతో నీరు కలవడం వలన ఆహారం జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. అయితే సైన్స్ ప్రకారం ఆరోగ్య నిపుణులు ఈ విధంగా చెప్పారు.

ఎప్పుడైతే నీరుని ఆహారంతో పాటు తీసుకుంటారో జీర్ణ ప్రక్రియ సులభం అవుతుంది. నీరు ఆహారాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి సహాయపడుతుంది. ఈ విధంగా శరీరానికి పోషకాలు అందుతాయి మరియు ఆహారాన్ని మృదువుగా చేసి జీర్ణ ప్రక్రియకు సహాయం చేస్తాయి. కనుక మీ శరీర తత్వం ప్రకారం ఆహారంతో నీరుని తాగడం లేక కొంత సమయం తర్వాత నీరుని తాగడం వంటివి చేయాలి. కొంతమందిలో ఆహారంతో పాటు నీరుని తీసుకోవడం వలన ఊపిరి తీసుకోలేకపోవడం లేక కడుపు నొప్పి వంటివి ఎదురవుతాయి. కాబట్టి అటువంటి మార్పులను గమనించి సరైన విధంగా నీరుని తాగాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version