రాష్ట్రంలోని అర్హులు అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని తెలంగాణ నీటిపారుదల, ఆహార అండ్ పౌరసరఫర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కొత్త రేషన్ కార్డుల జాబితాలో తమ పేర్లు రాలేదంటూ పలు చోట్ల ప్రజలు ఆందోళన చేస్తున్న తరుణంలో బుధవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా స్పందించారు.
‘రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతుంది. గ్రామసభలు ముగిసినా కార్డులు జారీ చేస్తాం. ఆ తర్వాత రేషన్ కార్డులు ఉన్న వారికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వబోతున్నాం’ అని మంత్రి ప్రకటించారు. కాగా, రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో అర్హుల కంటే అనర్హుల పేర్లే ఎక్కువగా లబ్దిదారుల జాబితాలో ఉన్నాయని రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభల్లో ప్రజలు ఆందోళన తెలుపుతున్నారు.